వర్షాకాలంలో చేపలు తింటే ఏమవుతుంది?
వర్షాలకు జలాశయాల్లో పాదరసం వంటి మలినాలు బాగా పెరిగి, చేపల కణజాలాల్లో పేరుకుపోతాయి. ఇలాంటి చేపలు తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.
వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది. ఇందులో పెరిగిన చేపలను తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి.
ఈ కాలంలో నీళ్లలో బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు బాగా పెరుగుతాయి. వీటిని తినడం వల్ల కడుపునొప్పి, బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి.
కలుషితమైన చేపలను తినడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
చేపలను నిల్వ ఉంచి ఈ కాలంలో తింటే.. ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.