వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటికోసం పాటించాల్సిన చిట్కాలు గురించి తెలుసుకుందాం.
ఈ కాలంలో కొంచెం పరిశుభ్రతగా ఉండాలి.
స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
వర్షాలకు దుస్తులు తేమగా ఉంటే ధరించకూడదు. పొడి దుస్తులు మాత్రమే ధరించాలి.
పండ్లను శుభ్రం చేయకుండా తినవద్దు.
అన్నింటికంటే ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి.