జుట్టు పెరగాలంటే ఈ ఫుడ్స్ తప్పనిసరి!
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మోన్ చేపలు తీసుకోవడం వల్ల జుట్టు తొందరగా పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల జుట్టు ఫాస్ట్‌గా పెరుగుతుంది.
ఆయిస్టర్స్‌లో జింక్ ఉంటుంది. ఇవి వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
ప్రొటీన్, విటమిన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లును తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి రోజూ తీసుకోవాలి.
జింక్, కాపర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చియా సీడ్స్ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
పోషకాలు మెండుగా ఉండే పాలకూర కూడా కురుల పెరుగుదలకు సహాయపడుతుంది.
బీటా కెరోటిన్ ఉండే స్వీట్ పొటాటోను తీసుకోవడం వల్ల వెంట్రుకలు బలంగా ఉంటాయి.