చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అవి మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
చేపలు తింటే మెదడులో రక్తప్రసరణ సాఫీగా సాగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
చేపలు తింటే వృద్ధాప్యంలో అల్జీమర్ వంటి వ్యాధులు రావు.
చేపలు తరచుగా తీసుకుంటూ ఉంటే గుండె కండలాలు బలపడతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
విటమిన్ డి లోపం, ఎముకలు బలహీనంగా ఉన్నవారు చేపలు తీసుకోవడం ఉత్తమం.
రోగనిరోధక శక్తి పెరగడానికి చేపలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
చేపలు తీసుకుంటే నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి తగ్గుతాయి.