క్యాన్సర్‌ను తగ్గించే ఆహారాలు ఇవే!

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీస్‌ను తినడం వల్ల క్యాన్సర్‌ను తగ్గించకోవచ్చు. 

టమాటాలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంటుంది. 

క్యాబేజీ, బ్రకోలి వంటి కూరగాయలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. 

మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే ఆకుకూరలు తింటే క్యాన్సర్ కణాలు నశిస్తాయి. 

నిమ్మ, ఆరెంజ్, కివి వంటి సిట్రస్ పండ్లలో క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి. 

వెల్లుల్లిలో ఉండే అల్లిసన్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

అల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సాయపడతాయి.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలో సహాయపడుతుంది.