మంచి నిద్రకు ఇవి బెస్ట్!

నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి.

చమోమిలే టీ తాగితే ఆందోళన, డిప్రెషన్‌ తగ్గి మంచి నిద్రపడుతుంది.

బనానా మిల్క్ షేక్‌ను నిద్రపోయే ముందు తాగితే రిలాక్స్ అయి చక్కగా నిద్రపోతారు.

వలెరియన్ రూట్‌తో తయారు చేసిన టీను తాగితే మంచి నిద్రపడుతుంది.

గ్రీన్‌ టీతో కూడా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు.

రాత్రి పూట బాదం పాలు తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్రపడుతుంది. 

పసుపు పాలను తాగి నిద్రపోతే చక్కగా నిద్రపడుతుంది.

పెప్పరమింట్ టీ తాగితే అజీర్ణం వంటి సమస్యలు తగ్గి.. ప్రశాంతంగా నిద్రపోతారు.

చెర్రీ జ్యూస్‌ను తాగడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.