అనసూయ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.

2008లో భద్రుక కళాశాల నుండి ఎంబీఏ చేసింది.

ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసింది.

వివిధ సినిమాల్లో నటించింది.

సినిమా అవకాశాలు ఉన్నప్పుడే సాక్షి టివిలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పని చేసింది.

ఇంట‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఎన్సీసీ క్యాంప్‌ లో సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. 

కొంతకాలం త‌ర్వాత మ‌ళ్లీ ఎన్సీసీ క్యాంప్‌లో భ‌ర‌ద్వాజ్‌తో స్నేహం ప్రేమగా మారింది.

తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో 2010లో పెళ్లి చేసుకున్నారు.

సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్. వారికి ఇద్దరు పిల్లలు.

న్యూస్ రీడర్‌గా తర్వాత జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా చేరింది. 

అక్కడి నుండి ఆమె లైఫ్ మారింది.