బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం. ఏపీలో కలిసిన తొలి నాటి నుంచి తెలంగాణపై వివక్ష. నీళ్లు, నిధులు, నియామకాలపై కుట్ర.
1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
2001లో టీఆర్ఎస్ ఏర్పాటుతో మరోసారి ఉగ్రరూపం దాల్చిన తెలంగాణ ఉద్యమం
తెలంగాణ కోసం ఒక్క సీపీఎం, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు పోరాడాయి. ప్రొఫెసర్ కోదండ రామ్ నేతృత్వంలో జేఏసీ తరఫున ఐక్య పోరాటం
ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి రక్షగా ఉంటానన్న నాయకుడు
ఉద్యమంలో నేటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చురుకైన పాత్ర. పలుమార్లు జైలుకెళ్లారు. దగా పడ్డ తెలంగాణను పున:నిర్మిస్తున్న కేసీఆర్.
2009 నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో భగ్గుమన్న తెలంగాణ. 2019 నుంచి 2014 వరకు సాగిన అలుపెరగని పోరాటం.
తమ భవిష్యత్ ను పణంగా పెట్టి పోరాడిన విద్యార్థులు, యువత. ప్రాణ త్యాగాలకు కూడా వెనుకడని వైనం. దాదాపు వెయ్యి మందికి పైగా అమరులైన బిడ్డలు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సద్దిమూటలతో కదిలిన పల్లె జనం.. పిల్లాజెల్లాతో కలిసి ఊరువాడ ఒక్కటైన కాలం. సాగర హారానికి అశేషంగా తరలివచ్చిన ప్రజలు.
మలి దశ ఉద్యమం హింస లేకుండా ప్రశాంతంగా సాగింది. పోరాటం ఊపిరిని చేసుకున్న తెలంగాణ జనం. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రాదని భావించి ఉద్యమించిన ప్రజలు.
ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ఆరు దశాబ్దాల అనంతరం 2014లో కల సాకారం.
2014 జూన్ 2వ తేదీన స్వరాష్ట్రం తెలంగాణ ఆవిర్భావం. బానిస సంకెళ్లు తెంచుకున్న తెలంగాణ పుడమి. నాడు పులకించిన పల్లె.. పట్టణం. అంతటా పండుగ వాతావరణమే.
తొలి, మలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు. సంక్షేమం, అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతూ పాలిస్తున్న కేసీఆర్.
దశాబ్ది ఉత్సవాలతో దేశంలోనే ప్రత్యేకత చాటుతున్న తెలంగాణ రాష్ట్రం.