వేసవిలో ఇవి తక్కువగా తీసుకోండి

బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ వేసవిలో తక్కువగా తీసుకోవడం మంచిది. 

వేరుశనగలు ఎక్కువగా తింటే ఈ కాలంలో శరీరం వేడిగా మారుతుంది. 

వేసవిలోనే మామిడి దొరుకుతుందని ఎక్కువగా తినకూడదు. వీటివల్ల మొటిమలు వంటివి వస్తాయి.

ఈ కాలంలో పాలకూరను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. 

వేసవిలో ఎక్కువగా గుడ్లు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఈ కాలంలో క్యారెట్ అధికంగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. 

కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదే. అలా అని పచ్చి కొబ్బరి అధికంగా తినకూడదు.