వేసవిలో సౌందర్యానికి చిట్కాలు

వేసవిలో చర్మం ట్యాన్ కాకుండా ఉండాలంటే స్కిన్‌కి కలబంద అప్లై చేయాలి.

అలాగే పుచ్చకాయ, కీరదోస వంటివి తినాలి.

నీరు ఎక్కువగా తాగుతుండాలి. 

రాత్రిపూట చర్మానికి గ్లిజరిన్ అప్లై చేసి, ఉదయాన్నే వాష్ చేసుకోవాలి. 

చర్మానికి అప్పుడప్పుడు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె అప్లై చేస్తుండాలి. 

చర్మాన్ని తుడుచుకునే టవల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది. 

వారానికి రెండుసార్లు సున్ని పిండి చర్మానికి అప్లై చేయడం మంచిది.