కళ్ల కలక అనేది వైరస్, బ్యాక్టీరియా లేదా అలర్జీ కారణంగా వస్తుంది.
ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్, బ్యాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
అలర్జీ, దుమ్ము-ధూళి, పెంపుడు జంతువులు, పూల పుప్పొడి ద్వారా వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులపాటు ఇది ఉంటుంది.
లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం, కళ్లపై చేతులు పెట్టకూడదు.
శుభ్రమైన టిష్యూ కాగితం, చేతి గుడ్డతో కండ్లు తరచూ తుడుచుకోవాలి.
నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
వేడిచేసి చల్లార్చిన నీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలి.
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు వాటిని మానేయాలి.
వైరస్ వల్ల కలిగే సమస్య ఒకట్రెండు వారాల్లో తగ్గిపోతుంది.
బ్యాక్టీరియాతో సమస్య ఏర్పడితే మెడిసిన్ కచ్చితంగా తీసుకోవాలి.