కర్పూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కర్పూరం వాడితే అలసట ఉండదు.
అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారణకు కర్పూరం బాగా పనిచేస్తుంది.
నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
కళ్ళకు మేలు చేస్తుంది కాబట్టి కర్పూరాన్ని కాటుకలో వాడుతారు.
పురుగుల మందులు, చెడువాసనల నిర్మూలనకు, చెదపురుగుల నిర్మూలనకు కర్పూరం వినియోగిస్తారు.
కర్పూరం రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.