మైదాతో చేసిన పదార్థాలు తింటే డేంజరా?

బయట హోటళ్లలో దొరికే పూరీ, చపాతీ, పరోటా, రుమాలీ రోటీ, జిలేబీ, బొబ్బట్లు, పిజ్జా వంటివన్నీ మైదాతో చేసినవే.

మైదాతో చేసిన పదార్థాలను రోజూ తింటే అనారోగ్యం తప్పదు. 

మైదాలో ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల తొందరగా జీర్ణం కాదు దీంతో పేగులో అల్సర్లు, క్యాన్సర్ వంటివి వస్తాయి.

మైదాతో చేసిన పదార్థాలు తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. 

ఎక్కువగా మైదా తింటే మలబద్దకం కూడా వేధిస్తుంది.

కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్లు మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

మైదా తినడం వల్ల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. 

వీటిలో పోషకాలు తక్కువగా ఉండటం వల్ల పోషకాహార లోపం కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. 

మైదా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.