పుట్టుక తప్ప చావు నమోదు కాని ఏకైక భారత జాతీయోద్యమ నాయకుడు సుభాష్ చంద్రబోస్
భారతదేశాన్ని బందీలుగా ఉంచే శక్తి ఈ భూమ్మీద లేదు. నాకు రక్తం ఇవ్వండి.. నేను స్వేచ్ఛనిస్తాను అని నినదించాడు.
అహింస ద్వారా స్వాతంత్రం రాదని.. ఆయుధం పట్టిన పోరాట వీరుడు
ఒడిశాలోని కటక్ లో 1897 జనవరి 23న నేతాజీ జన్మించారు
బెర్లిన్ లోని స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇండియాకు చెందిన భారత, జర్మన్ అధికారులు బోస్ కి నేతాజీ అనే బిరుదిచ్చారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో జాతీయోద్యమం కోసం ప్రత్యేక సైన్యాన్ని నిర్మించాడు.
21 ఏళ్లకే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.
రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఎన్నికై.. గాంధీజీతో సిద్ధాంతపరమైన విబేధాల కారణంగా పదవికి రాజీనామా చేశాడు.
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
భారత ప్రభుత్వం చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా ప్రకటించింది.
శ్రీ ఆర్య అనే పత్రికకు బోస్ సంపాదకుడిగా పనిచేశారు.
స్వతంత్ర పోరాటంలో 11సార్లు జైలుకు వెళ్లారు.
1945 ఆగష్టు 18న ఫార్మోజా సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని జపాన్ రేడియో ప్రకటించింది.