నిద్రకు భంగం వాటిల్లకూడదంటే.. ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి

రాత్రిపూట బ్రెడ్ తినకూడదు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. 

డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. 

నిద్రపోయే ముందు ఐస్ క్రీమ్ తినకూడదు. ఇవి షుగర్ లెవెల్స్ పెంచి నిద్రకు భంగం కలిగిస్తాయి.

మసాలా ఫుడ్స్ నిద్రపోయే ముందు తింటే ఎసిడిటీ పెరిగి గ్యాస్‌కు దారితీయడంతో పాటు నిద్ర కూడా పట్టదు.

చాక్లెట్లను నిద్రపోయే ముందు తినడం వల్ల నిద్రకు భంగం కలగటమే కాకుండా నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

పుచ్చకాయ వంటి వాటర్ కంటెంట్ ఉన్నవి కూడా రాత్రిపూట తినకూడదు. ఇవి మూత్రం స్థాయిలను పెంచి నిద్రకు భంగం కలిగిస్తాయి.