మొక్కజొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మొక్కజొన్నలు పీచులోనూ ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

పీచుతో తయారు చేసిన టీలో విటమిన్‌ బి2, సి, కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

మొక్కజొన్న పొట్టును తీసేసిన తర్వాత పీచును రెండు గ్లాసుల నీటిలో పోసి బాగా మరిగించాలి.

బాగా మరిగిన తర్వాత ఆ టీని వడకట్టి తాగేయాలి.

చేదుగా అనిపిస్తే టీలో తేనె వేసుకోవచ్చు. అయితే చక్కెర వేసుకోకూడదు.

పీచుతో తయారు చేసిన టీని తాగితే యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది.

మొక్కజొన్న పీచుతో చేసిన టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 

మొక్కజొన్న పీచు టీ తాగితే మూత్రనాళంలో మంట తగ్గుతుంది.