ఒక్క మైసూర్ బోండా తినడం వల్ల 227 కేలరీలు లభిస్తాయి.
మైసూర్ బోండాలో కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు ఉంటాయి.
ప్రోటీన్లు 17 కేలరీలు ఉంటాయి. ఒక్క మైసూర్ బోండా వల్ల ఏకంగా 110 కేలరీల కొవ్వు శరీరానికి అందుతుంది.
మైసూర్ బోండా మైదా పిండితో చేస్తారు. మైదా పిండితో చేసే ఏ పదార్థం అయినా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు మైసూర్ బోండా జోలికి వెళ్లకపోవడం మంచిది.
మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు అమాంతం పెరుగుతాయి.
మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బోండాలను తింటే బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది.