ఎండు ద్రాక్షలో తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఎండు ద్రాక్ష తినడం వల్ల దంతాలలో బ్యాక్టీరియా పెరగదు.
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్ బి పుష్కలంగా ఉంది. బ్లడ్ కౌంట్ త్వరగా పెరుగుతుంది.
ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.
ఎండుద్రాక్షలో ఎసిడిటిని తగ్గించే పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంది.
ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరుగుతుంది.
ఎండుద్రాక్షలోని పోషకాలు మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం బాగా పనిచేసేలా చేస్తాయి.