వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు వ్యాధులు కూడా వచ్చేసే అవకాశం ఉంది. 

దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.

వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

యాపిల్స్, జామూన్స్, లిచీ, ప్లమ్స్, చెర్రీస్, బొప్పాయిలు, దానిమ్మ వంటి పండ్లు తినాలి.

పాలకు బదులు పెరుగు, ఇతర ప్రోబయోటిక్స్ తీసుకోండి. వీటితో చెడు బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం తగ్గుతుంది.

పచ్చివి తినడం, సలాడ్‌లను తినడం మానుకోండి. ఒకవేళ తినాల్సి వస్తే తినడానికి ముందు ఆవిరిలో ఉడికించి తినాలి.

వర్షాకాలంలో నువ్వులు, వేరుశనగ, ఆవ నూనెలను నివారించండి. ఇవి ఇన్ఫెక్షన్లను ఆహ్వానిస్తాయి. మొక్కజొన్న నూనె లేదా ఏదైనా తేలికపాటి నూనెను తీసుకోండి.