చూయింగ్ గమ్ ఎక్కువగా నములుతున్నారా?

చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి.

దీనిలోని చక్కెర వల్ల దంతక్షయం, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువ సేపు నమలడం వల్ల దవడ ప్రాంతంలో ముడతలు వస్తాయి.

చూయింగ్ గమ్‌లోని కృత్రిమ చక్కెర డయేరియా సమస్యకు దారితీస్తుంది.

చూయింగ్ గమ్ ఎక్కువసేపు నమలడం వల్ల చిగుళ్ల నొప్పి వస్తుంది.

అలాగే అలసట, తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. 

నమలడం వల్ల నరాల బలహీనత కూడా వస్తుంది. 

రోజుకు మూడుసార్లు కంటే ఎక్కువగా చూయింగ్ గమ్ నమలకూడదు.

ఒక చూయింగ్ గమ్‌ను 15 నిమిషాల కంటే ఎక్కువసేపు నమలకూడదు.