ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళాలను బ్రాంకియోల్స్ అంటారు. ఇన్ఫెక్షన్ ఇతర కారణాలతో వాయు నాళాల్లో వాపు వస్తుంది. దీన్నే బ్రాంకైటిస్ అంటారు. ఈ ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టవచ్చు.

అల్లంలోని చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తలకు కలిగిన నష్టాన్ని నయం చేస్తుంది. ఇందులో ఉన్న యాంటి యాక్సిడెంట్లు, యాంటి మైక్రోబయిల్ లక్షణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పసుపులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే కర్కుమిన్ బలమైన యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. వాయా నాళాల్లో ఏర్పడే వాపును నివారించడంలో తోడ్పడుతుంది. చిన్నారులకు పసుపు పాలు తాగిస్తే చాలా మంచిది.

యాపిల్స్ తినడం వలన చిన్నారుల్లో బ్రాంకైటిస్ సమస్య నంచి ఉపశమనం లభిస్తుంది. యాపిల్స్ తింటే ఊపిరితిత్తుల్లో ఏర్పడే టాక్సిన్లు తొలగిపోతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉంటాయి.

బీట్ రూట్ తింటే శరీర కణాలకు ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం, పోటాషియం, విటమీన్లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి గుండెకు మంచిది అని అందరికి తెలుసు. ఇందులో ఉండే యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిిడెంట్ లక్షణాలు ఊపిరితిత్తులను రక్షిస్తాయి.

ఆకుకూరలు తినడం శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఫలితంగా శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల సామార్థ్యాన్ని పెంచుతాయి.

తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు శ్వాసవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పైనాపిల్‌లో బ్రోమలైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన బ్రాంకైటిస్ లక్షణాలు దూరం అవుతాయి.