వర్షాకాలంలో ఉసిరితో లాభాలు?
ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో ఉసిరిని రోజూ తింటే చాలా లాభాలున్నాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
రోజూ ఉసిరి తింటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.
చర్మం మృదువుగా ఉండటంతో పాటు కాంతిమంతంగా కూడా ఉంటుంది.
గుండె సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.
జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి జ్యూస్ వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.
నెలసరి సమస్యలను తగ్గించి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఉసిరి సాయపడుతుంది.