కంప్యూటర్ ముందు గంటలు తరబడి కూర్చుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఎక్కువసేపు కూర్చోకుండా అరగంటకు ఒకసారి లేచి నిల్చోవాలి.
వీలైతే కాసేపు వాకింగ్ కూడా చేయండి.
కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు సరైన భంగిమలో కూర్చోవాలి. లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది.
గంటల తరబడి కూర్చోని పనిచేసేవాళ్లు ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి.
డెస్క్ జాబ్ చేసేవాళ్లు రోజూ వ్యాయామం చేయడం చాలా మేలు.
పోషకాలు ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
గంటల కొద్ది సిస్టమ్‌ల ముందు ఉండి వర్క్ చేసేవాళ్లు యోగా, ధ్యానం వంటివి చేయడం మేలు.