మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.
మునగాకును రోజూ ఉదయాన్నే పరగడుపున తిన్నా, వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగ ఆకులో పుష్కలంగా ఉన్నాయి.
నాలుగైదు వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగ ఆకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారు.
ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగ ఆకును ఉపయోగిస్తారు
పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.