పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడితే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
పారాసిటమాల్ ఎక్కువగా వాడితే రక్త హీనత వల్ల బలహీనంగా మారుతారు.
ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటే కాలేయం దెబ్బతింటుంది.
పారాసిటమాల్ ఎక్కువగా వాడితే కళ్లు, చర్మం పసుపురంగులోకి మారుతుంది. మూత్రం కూడా పసుపు రంగులోకి మారిపోతుంది.
ఈ ట్యాబ్లెట్స్ అధికంగా వినియోగిస్తే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువవుతాయి.
పారాసిటమాల్ ఎక్కువగా వాడితే ఆకలి వేయకపోవడం, చెమటలు ఎక్కువగా పట్టడం, వాంతులు, పొత్తి కడుపు పైభాగంలో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.