ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ హీరోగా మారిన ఆకాశ్ మధ్వాల్

ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఆకాశ్ మధ్వాల్  23 నవంబర్ 1993న జన్మించాడు.

ఐపీఎల్ లో మొదట ఆర్సీబీ కొనుగోలు చేసింది.

ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం లభించలేదు. ఈ ఏడాది రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు

ఇంజనీరింగ్ చదివాడు. మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆకాశ్ ప్రతిభను గుర్తించాడు.

అవతార్ సింగ్ అనే కోచ్ వద్ద ఆకాశ్ శిక్షణ తీసుకున్నాడు. ఉత్తరాఖండ్ తరఫున రంజీ ఆడాడు. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై తరఫున 7 మ్యాచ్ లు ఆడిన ఆకాశ్ ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. 

హైదరాబాద్, లక్నో మ్యాచ్ లో సత్తా చాటాడు. 4 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అరుదైన బౌలర్ గా ఆకాశ్ రికార్డు.

2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు తరఫున ఆకాశ్ ఆడాడు. 2022-23 దేశవాళీ సీజన్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

ముంబై జట్టులో బుమ్రా తర్వాత అంతటి కీలక బౌలర్ గా ఎదిగిన ఆకాశ్. త్వరలోనే టీమిండియాలోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.