ADB: సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని IFTU జిల్లా ప్రదాన కార్యదర్శి బి వెంకట నారాయణ కోరారు. పట్టణంలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలను రద్దుచేసి, పాత చట్టాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.