SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండా అంగన్వాడి కేంద్రంలో పురుగులు పట్టిన గుడ్లు ఇస్తున్నారని గ్రామస్తులు శుక్రవారం గుడ్లు పగలగొట్టి చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. పౌష్టిక ఆహారాలు ఇచ్చే అంగనవాడి సెంటర్లలో ఇలాంటి పాచిపోయిన గుడ్లు ఇవ్వడంతో బాలలు, బాలింతలు, గర్భవతిలు అనారోగ్యానికి గురైతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.