Malla Reddy Dance: ఏ వేడుక అయినా సరే మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) తనదైన శైలిలో స్టెప్పులు వేస్తారు. కెమెరా మొత్తం తన వైపు తిప్పేలా చూస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీర్జాదిగూడలో తెలంగాణ రన్ నిర్వహించారు. రాచకొండ పోలీసులు, పీర్జాదిగూడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రన్ జరగగా.. ముఖ్య అతిథులుగా మంత్రి మల్లా రెడ్డి (Malla Reddy), ఎంపీ సంతోష్ కుమార్ (Santosh Kumar), ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సీపీ చౌహన్, కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.
డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. pic.twitter.com/PD52jOv99L
రన్ ముగిసిన తర్వాత వేదిక మీద పాటలు ప్లే చేశారు. డీజే టిల్లు పాట ప్లే కాగా.. మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)స్టెప్పులు వేశారు. బీట్‌కు తగినట్టు డ్యాన్స్ చేశారు. విద్యార్థులు ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా డ్యాన్స్ చేశారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150లో గల అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు కూడా మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) కాలు కదిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం అని మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. రన్స్ చేయడం అవసరం అని కామెంట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడ లేవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని అంటున్నారు. సీఎంగా కేటీఆర్, ప్రధాన మంత్రి పదవీ కేసీఆర్ చేపడుతారని అభిప్రాయ పడ్డారు.