JGL: వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ అంబులెన్స్ సేవలు ప్రారంభించి నేటికి సంవత్సరం పూర్తైంది. ఈ కాలంలో సుమారు 1200 మందికి అత్యవసర వైద్య సేవలు అందించి ప్రజా సేవలో అంబులెన్స్ కీలక పాత్ర పోషించింది. ప్రమాదాలు, ప్రసూతి అత్యవసరాలు, ఆకస్మిక అనారోగ్య ఘటనల్లో వేగంగా స్పందించి ప్రాణాలను రక్షించడం ద్వారా అంబులెన్స్ ప్రజల్లో విశ్వాసాన్ని పొందింది.