NRPT: జిల్లా పరిధిలోని బాల రక్షణ భవనానికి సంబంధించిన వాహనం నడపేందుకు ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం సర్టిఫికెట్ తదితర పత్రాలతో ఈనెల 7లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.