NGKL: కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం 1 భవనానికి స్వామి వివేకానంద సేవా బృందం సభ్యులు మంగళవారం రంగులు వేశారు. భవనం గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరడంతో స్పందించిన సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ సొంత ఖర్చుతో భవనానికి రంగులు వేయించి కొత్త కళ తెచ్చారు. అనంతరం భవనం పరిసరాలలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.