ADB: సొనాల మండల సర్పంచ్లు గురువారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో కలిశారు. మండలంలోని పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. అనంతరం వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.