MHBD: చిన్నగూడూరు మండలం మేఘ్యాతండా పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నలుగురు సర్పంచ్ అభ్యర్థులలో ముగ్గురు ఉపసంహరించుకోవడంతో, స్వతంత్ర అభ్యర్థి బాదావత్ జయప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ఎనిమిది వార్డులకు నామినేషన్ వేసిన 16 మందిలో 8 మంది ఉపసంహరించుకోవడంతో, వార్డులన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి.