MHBD: కేసముద్రం మండలం అర్పణపల్లిలో ఆదివారం సర్పంచ్ అభ్యర్థి బుడిగే శృతి తరఫున భర్త బుడిగే అశోక్ బాండ్ పేపర్‌పై టెంట్ హౌస్ ఇవ్వడం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు,పేద బాలికల వివాహ సహాయం, మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి హామీలను ప్రకటించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. హామీలు నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని రాతపూర్వకంగా ఇచ్చినట్టు సమాచారం.