BHPL: మహాదేవపూర్ మండలం కేంద్రాలోని కాలేశ్వరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో శనివారం నవగ్రహ పూజలు ఘనంగా జరిగాయి. జిల్లా నలువైపుల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మహేశ్ మాట్లాడుతూ.. జాతక రీత్యా ఏ దోషాలైనా నవగ్రహ పూజల వల్ల పరిహారం చెందుతుందని తెలిపారు.