SRD: విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సిద్దిపేట MLA హరీష్ రావును ఆదివారం ఉదయం పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హరీష్ రావు కుమారుడు ఆర్చిష్మాన్ కొలంబియా యూనివర్సిటీలో MBA పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. MLAలు మాణిక్ రావు, చిత్ర ప్రభాకర్ కూడా హరీష్ రావును కలిసి అభినందనలు తెలియజేశారు.