NZB: చలికాలం, పండుగ సీజన్ కారణంగా చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిజామాబాద్ జిల్లాలో స్కిన్లెస్ చికెన్ కేజీ 302కు చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర 265 ఉంది. కాగా ఇప్పుడే ఈ స్థాయిలో చికెన్ ధరలు ఉంటే, సంక్రాంతికి ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్పత్తి ఖర్చులు పెరగడం, డిమాండ్ తగ్గకపోవడం దీనికి కారణాలుగా తెలుస్తుంది.