MBNR: మహబూబ్ నగర్ నుంచి గానుగాపూర్ క్షేత్రానికి ఈనెల 13న రాత్రి 9 గంటలకు ప్రత్యేక బస్సులు బయలు దేరుతాయని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. ఈ యాత్రలో దత్తాత్రేయ స్వామి, బసవేశ్వర స్వామి దర్శనం కూడా ఉంటుందన్నారు. టికెట్ ధరలు పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.500గా నిర్ణయించారు. వివరాలకు 7013646089, 9441162588, 9985320529ను సంప్రదించాలన్నారు.