MBNR: బాలానగర్ మండలం గోరిగడ్డతండాకు చెందిన నేనావత్ శ్రీను నచికేత విద్యామందిర్ లో 20మంది విద్యార్థులకు శనివారం క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణప్రాంతాల నుంచి వచ్చి ఆశ్రమపాఠశాలలో చదువుకున్న విద్యార్థులు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.