MHBD: నెల్లికుదురు మండలం వావిలాల బోటిమీద తండాకు చెందిన కొర్ర బిక్య (40) బుధవారం ఉదయం తన వ్యవసాయ బావి దగ్గర మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈఏంటి బిక్షపతి, పైలట్ వీరన్న ఘటనాస్థలానికి వెళ్లి ప్రథమ చికిత్సను అందించి జిల్లా ఆసుపత్రికి తరలించారు.