WGL: గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.