JN: జనగామ డీసీపీ కార్యాలయంలో మావోయిస్టు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ (34) ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో పనిచేసిన రమేష్, పునరావాస పథకం కింద లొంగిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 8 లక్షల్లో తొలి విడతగా రూ. 25 వేలును డీసీపీ రాజమహేంద్ర నాయక్ అందజేశారు.