BDK: దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇవాళ భూమి పూజ చేసుకున్న దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డింగులు, సకల సౌకర్యాలు పూర్తి చేస్తాం అందుబాటులోకి తీసుకువస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు.