SDPT: ములుగు మండలం వంటిమామిడిలో గజ్వేల్ షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఏఎస్సై వీ.శివరాములు, పీసీ మహేష్ పాల్గొని సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళా రక్షణ చట్టాల గురించి వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్య క్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొని షీ టీమ్ సేవలను అభినందించారు.