SRPT: కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్, కరాటే క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. భద్రాచలంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్, నల్లగొండలో జరిగిన కరాటే పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం విద్యార్థులను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అభినందించారు.