SRPT: హుజుర్నగర్లో బీసీ ఉద్యమకారుడు ఈశ్వర సాయి చారికి జనసేన నాయకులు ఘన నివాళులు అర్పించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఆయన చేసిన ఆత్మబలిదానం బాధాకరమని గాజనబోయిన సైదులు షేక్ హాసనమియా అన్నారు. కుటుంబానికి 50 లక్షల సాయం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆలస్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిచారు.