NLG: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్‌ను గెలిపించాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఇవాళ పట్టణంలోని యాదవ సంఘం భవనం ఆవరణలో నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.