NLG: స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠినమైన చర్యలు తప్పవని ఎస్సై డీ.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం మండలంలోని రావులపెంట గ్రామంలో స్థానిక ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.