MBNR: 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా 641 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అడ్డాకుల 17, మూసాపేట,15 భూత్పూర్ 19, బాలనగర్ 37, జడ్చర్ల 45, మొత్తంగా 133 గ్రామపంచాయతీలకుగాను 132 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరపనున్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల మండలంలోని ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవమైనట్టు తెలిపారు.